Aswaraopet News : గ్రామ అభివృద్ధి మరియు ప్రజాసేవకు కృషి చేస్తాం

TRINETHRAM NEWS

తేదీ : 19//12/2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: (త్రినేత్రం న్యూస్); అశ్వరావుపేట నియోజకవర్గం, మండలం లో గల గ్రామపంచాయతీలు వినాయకపురం , కొత్త మామిళ్ళ వారి గూడెం, తిరుమల కుంట, దిబ్బగూడెం, మొ ద్దుల మడ , బచ్చు వారి గూడెం ఆ గ్రామాల సర్పంచులు మరియు ఉప సర్పంచులు చిప్పల. పండు రెడ్డి, సరియం. పండు, నారం. జగదీశ్వరరావు, వగ్యాల. లక్ష్మణరావు, కొ ర్సా . రాజేష్ జెట్టి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాళ్లకు ఎన్ని వార్డులు సపోర్ట్ చేశాయో వివరించి చెప్పారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. మా గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించినందుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. మేము గ్రామ అభివృద్ధికి , ప్రజాసేవకు కృషి చేస్తామని అన్నారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పరిష్కార దిశగా ముందుంటామని సూచించారు. ఎల్లవేళలా మా గ్రామ ప్రజలకు, అభివృద్ధికి ఇష్టంతో పనిచేస్తామని వాళ్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం అయిన తరువాత నుండి పనులు ప్రారంభిస్తామని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will work for village development and public service

You cannot copy content of this page

Scroll to Top