కూకట్పల్లి డిసెంబర్ 19 (త్రినేత్రం న్యూస్) : ఈ రోజు కేపిహెచ్‌బీ రోడ్ నెంబర్–1 లోని గాంధీ విగ్రహం వద్ద, జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద నివాస కాలనీల్లో ఒకటైన కేపిహెచ్‌బీ కాలనీని మూడు ముక్కలుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి ముమ్మారెడ్డి ప్రేమకుమార్ హాజరై ప్రజలతో కలిసి నిరసనలో పాల్గొని తమ పూర్తి మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రేమకుమార్ మాట్లాడుతూ, కేపిహెచ్‌బీ కాలనీని విభజించడం వల్ల పరిపాలన లో గందరగోళం, ప్రజలకు మౌలిక సదుపాయాల విషయంలోను ఇబ్బందులు, అభివృద్ధి కార్యక్రమాల అమలులోను అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కాలనీ ఒకే డివిజన్‌గా కొనసాగితేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని, ప్రజల ఐక్యతను దెబ్బతీయకుండా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధమైన ఒత్తిడి తీసుకువస్తూ, కేపిహెచ్‌బీ కాలనీని ఒకే డివిజన్‌గా కొనసాగించేలా శతవిధాల ప్రయత్నాలు చేస్తామని, అదేవిధముగా నియోజక వర్గం లో ఉన్న వివిద డివిజన్లలోని సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్తం చేస్తున్నామని, అవసరమైతే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయాలను జనసేన పార్టీ ఎప్పటికీ వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు.కేపిహెచ్‌బీ కాలనీ ప్రజల ఐక్యతను కాపాడుతూ, వారి హక్కుల కోసం పోరాడటం జనసేన పార్టీ బాధ్యతగా కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ శాంతియుత నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్, పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు తదితరులు పాల్గొని తమ సంఘీభావం ప్రకటించారు. అలాగే పెద్ద సంఖ్యలో కేపిహెచ్‌బీ కాలనీ వాసులు, వివిద పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలు హాజరై నిరసనను చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


