MLA KP. Vivekanand : జర్నలిస్టుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి చర్చిస్తాం

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని కలిసిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ H 143 టీజెఎఫ్ కమిటీ సభ్యులు….

జర్నలిస్టులను విభజిస్తూ అక్రిడేషన్లలో ప్రభుత్వం కోత పెడుతూ తీసుకువచ్చిన జీవో 252 ను సవరించడంతో పాటు హెల్త్ కార్డులు, ఇంటి స్థలాల కేటాయింపు వంటి సమస్యలపై అసెంబ్లీ వేదికగా చర్చించాలని కోరుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ,బీఆర్ఎస్ ఎల్ఫీ విప్ కేపీ వివేకానంద ను కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది.

దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో లేవదీసి చర్చిస్థాననీ ఎమ్మెల్యే హామీని ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కొలెపాక వెంకట్, నమస్తే తెలంగాణ జిల్లా స్టాపర్ రామారావు, భరత్ కళ్యాణ్, రవికిరణ్ జిల్లా ఉపాధ్యక్షులు సుగ్రీవుడు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎర్రోళ్ల బాబు, ఎర్రోళ్ల కృష్ణ, సైదులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will raise and discuss the issues of journalists in the Assembly

You cannot copy content of this page

Scroll to Top