Chiniboina Pullarao : గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నం

TRINETHRAM NEWS

తేదీ : 05/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, కృష్ణ రావులపాలెం పంచాయతీ సర్పంచ్ చినిబోయిన. పుల్లారావు. గ్రామ అభివృద్ధికి చేసిన సేవలు గురించి వివరించారు. గత ప్రభుత్వంలో గ్రామం మొత్తం చీకటి మయం లో ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తరువాత ప్రతి ఒక్కరి కుటుంబంలో వె లుగు వచ్చిందని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలలో అమలు చేసినటువంటి పథకాలు అన్ని అర్హులైన కుటుంబాలకు ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతానికి గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందని పేర్కొన్నారు.

త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కితే. కూటమి ప్రభుత్వం ఆ పాతాళం నుండి కిందకు దింపి ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, త్వరలోనే మిగిలి ఉన్న పథకాలను అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేపల చెరువును దూరం పెడితే ఇప్పుడు ఆ చెరువు గురించి సంబంధిత అధికారులకు తెలియజేయగా త్వరలోనే పరిష్కారం చేస్తామని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We are leading the

You cannot copy content of this page

Scroll to Top