తేదీ : 05/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, కృష్ణ రావులపాలెం గ్రామపంచాయతీలో ఉంటున్నటువంటి టిడిపి మాజీ యం పి టి సి తడికమళ్ళ. రామారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం గెలిచిన తరువాత ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం అయ్యే దిశగా వెళ్తున్నామని తెలిపారు. ఎవరైనా ఏదైనా సమస్య ఉందని తనకు చెబితే వెంటనే ఆయన చేసే సమస్యకు వెంటనే పరిష్కరిస్తున్నాను అని, ఒకవేళ ఆ సమస్య కు ఎవరైతే పరిష్కారం చేస్తే అవుతుందో వాళ్లతో చేపిస్తున్నానని పేర్కొన్నారు.
గతంలో ఈ గ్రామంలో సిసి రోడ్లు , వీదీ దీపాలు, డ్రైనేజీ సమస్య లాంటివి ఉన్నాయని అన్నారు. ఇప్పుడు అటువంటి సమస్యలు ఏమీ లేవని చెప్పారు. డ్రైనేజీ సమస్య మాత్రమే ఉందని తెలిపారు. ఈ సమస్య కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అనడం జరిగింది. ప్రజలే మాకు దేవుళ్ళు , వాళ్లకు సేవ చేయడమే మా బాధ్యతని అన్నారు. త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలు గాని, జిల్లా పరిషత్ , మండల పరిషత్ ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
యన్ డి యే ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి కుటుంబంలో చీకటిపోయి వెలుగు వచ్చిందని ఆయన అన్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలలో అమలు చేసినటువంటి వాటిని అర్హులైన ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. మూడు రోజుల క్రితం అమరావతిలో జరిగినటువంటి దేశ ప్రధాని సభ ఘనంగా నిర్వహించారని, లక్షల కొద్ది ప్రజలు, కూట మి కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారని, వారికి ఎటువంటి లోటుపాట్లు, రాకుండా సంబంధిత అధికారులు, నాయకులు చూసుకోవడం జరిగిందని తెలిపారు.
సభకు వచ్చిన వారికి మంచినీరు, మజ్జిగ, భోజనం సదుపాయం కల్పించాలని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు అని చెప్పారు. అదేవిధంగా కులమత పార్టీ భేదం లేకుండా ప్రజలకు న్యాయం చేస్తున్నామని చెప్పడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


