రైతుల పాసు పుస్తకాలపై తన బొమ్మలు వేసుకుని వారి హక్కులను కాలరాసిన వ్యక్తి జగన్…
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది…
పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…
Trinethram News : రెవిన్యూ పరంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి, వైసిపి పాలనలో జరిగిన అవకతవకలను సరిచేయడానికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలో శుక్రవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెవిన్యూ గ్రామసభలు, పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, కొత్తపేట ఆర్డిఓ పి శ్రీకర్,ఆకుల రామకృష్ణ, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు లతో కలిసి పాల్గొన్నారు.
రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో చేసిన తప్పులతో రెవెన్యూ పరమైన లక్షలాది సమస్యలు వెలుగులోకి రావడం జరిగిందన్నారు.
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. వైసీపీ పాలన వల్ల ప్రధానంగా రెవెన్యూ సమస్యలు అయితే చాలా సంక్షిష్టంగా మారాయన్నారు.
సామాన్య ప్రజల రెవెన్యూ రికార్డులు అన్నీ తారు మారు అయిపోయి నేటికీ అనేక రకాల ఇబ్బందులు వెలుగులోకి వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం పాస్ బుక్ ల పంపిణీ పేరుతో, సర్వేల పేరుతో అనేక అవకతవకలు చేసిందన్నారు.
ప్రజలకు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తులపై హక్కును కాలదన్నేలా, రాజముద్రతో ఇవ్వవలసిన పట్టాదారు పాస్ పుస్తకాలను, ప్రజల కష్టార్జితాన్ని తన సొంత ఫోటోలతో, తన పార్టీ రంగులద్ది తప్పుల తడకలతో జగన్ ఏదో తన సొంత ఆస్తులు ఇచ్చినట్లు ప్రజలకు ఇచ్చారని విమర్శించారు.
వాటిలో కూడా అనేక తప్పులు దొర్లాయని అన్నారు. లక్షలాది సమస్యలతో నిండిన వాటిని సరిచేయడానికి కూటమి ప్రభుత్వం సతమతం అవుతుందని, రెవెన్యూ మంత్రి అనగాని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ను ఏర్పాటు చేసి ఈ సమస్యలను పరిష్కరించి అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
భూమిపై రైతులకు హక్కులు కాలరాసేలాగ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిన విషయం గుర్తు చేశారు. గత సంవత్సరం ఆత్రేయపురంలో పడవల పోటీలు జిల్లా కలెక్టర్ సహకారంతో నిర్వహించామని, అవి మంచి పేరు తీసుకు వచ్చాయని ఈ సంవత్సరం మరింత ఘనంగా ఈ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈసారి కలెక్టర్ మహేష్ కుమార్, టూరిజం శాఖ సహకారంతో రూ.1కోటి నిధులు, దాతల సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు అన్నారు. సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


