Water Pooling : రోడ్డుపై నిండా నిలిచిన నీళ్లు… ప్రయాణం సాగేదెలా

TRINETHRAM NEWS
Water pooling all over

వడ్డెర గూడెం బిటి రోడ్డుకు మోక్షం ఎప్పుడు…?
కంకర పరచి ఏడాదిన్నర కావస్తున్నా బిటి రోడ్డు ఊసేలేదు…
అధ్వాన్నంగా వావిలికోల్,వడ్డెర గూడెం రోడ్డు..
కనికరించని కాంట్రాక్టర్ ,చొరవ చూపని ప్రజాప్రతినిధులు…
ప్రజల పై బాధ్యత మరిచిన ప్రజాప్రతినిధులు…
ఇంకెన్నాళ్లు నిరీక్షణ…
బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ముత్యాలు

Water Pooling : త్రినేత్రం న్యూస్ : డిండి( గుండ్ల పల్లి) జూన్ 14, త్రినేత్రం న్యూస్. చినుకు పడితే చిత్తడిగా మారి మరింత వానోస్తే రోడ్డుపై మడుగులను తలపించేలా శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి నీరు నిలిచి ప్రజలు ఆ రహదారి గుండా వెళ్లాలంటే ప్రాణసంకటంగా మారింది.ఆ ఊరికి వెళ్లాలంటే ప్రజలు నరకయాతన పడుతున్నారు. వర్షాలు తాకిడికి,రోడ్లన్నీ బురద మయమై, కంకర పూర్తిగా కొట్టుకు పోయి రోడ్డుపై మడుగులు ఏర్పడి రాకపోకలకు వీలు లేకుండా అద్వాన్నంగా డిండి మండలంలోని వావిలికోల్ వడ్డెరగూడెం రోడ్డు మారింది.
కాంట్రాక్టర్ కంకరపరచారు మళ్ళీ ఆ దిక్కున కూడా మొకం చూడకుండా ముఖం చాటేసారు.గ్రామస్తులు నిత్యం రోడ్డుపై అవస్థలు పడుతుంటే పట్టినుకొనే నాధుడు కరువయ్యారు. ఇక ఆ గ్రామ ప్రజలు హైదరాబాద్ లో ఉండి వారు సొంత ఊరికి రావాలంటే పండగైనా,అవసరాలకైనా, తమ ఊరికి పోవాలన్నా కష్టాలు తప్పడం లేదు. ఈ రోడ్డు మీదుగా వడ్డెర గూడెం, బ్రాహ్మణ పల్లి తండాకు, బ్రాహ్మణపల్లికి వెళ్లే మార్గం కావడంతో వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతం. కంకర పరచి సంవత్సరం నర కావస్తున్న సదరు కాంట్రాక్టర్ కనికరించకపోగా, ప్రజాప్రతినిధులు మాకేం పట్టనట్లు వ్యవహారిస్తున్నారు.సమస్య మాది కాదుకదా! అనే చందంగా వ్యవహారిస్తున్నారు.
గతంలో సైతం వడ్డెరగూడెం ప్రజలు,యువకులు, మహిళలు ఓర్సు ముత్యాలు ఆధ్వర్యంలో రోడ్డు పై పలు మార్లు నిరసన వ్యక్తం చేసారు.ఎన్నో మార్లు పత్రికల్లో వార్తలు ప్రచురితమైనా అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరే త్తినట్లు వ్యవహారిస్తున్న తీరు ప్రజలను అగ్రహానికి గురిచేస్తున్నాయి.సమస్యను పట్టించుకోని పరిష్కరించడం లేదు. ఎన్నికలప్పుడు ఎన్నో చెప్పి ఓటు వేయించుకున్నారు తప్ప రోడ్డును మాత్రం బాగు చేయడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళన చేసేందుకు వెనుకాడబొమని గ్రామస్తులు వాహనదారులు హెచ్చరిస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే స్పందించి పరిష్కారం చూపాలి…

మా గ్రామానికి బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని రోడ్డు పై వెళ్లాలంటే ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుందని స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పందించి ఇక నైనా సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం హాస్యాస్పద్ధం…

డిండి మండలంలోని వావిలి కోల్ గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డెర గూడెం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించాలని,కంకర పరచి, బీటీ వేయడం మరిచారని దీనివల్ల ప్రజలు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి ఎంతోమంది వాహనదారులు కిందపడి గాయాల పాలయ్యారని వానోస్తే మడుగుల మాదిరిగా నీళ్లు నిండి అవస్థలు పడుతున్నా స్పందించడం లేదని,నిరసనలు వ్యక్తం చేసి,పత్రికల్లో వార్తలు ప్రచురితమైనా సంబంధిత అధికారులు,కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం హాస్యాస్పదమని బిఆర్ఎస్ వడ్డెర గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు ఓర్సు ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వడ్డెర గూడెం, బ్రాహ్మణపల్లి,బ్రాహ్మణపల్లి తండా ప్రజల ప్రధాన రహదారి అయిన వడ్డెరగూడెం రహదారిని బీటీ రోడ్డు వేసేలా స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చొరవ చూపి వీలైనంత త్వరగా బీటీ రోడ్ నిర్మాణం చేపట్టేలా అధికారులకు ఆదేశించాలని ముత్యాలు కోరారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top