జూలై 5, 2026
TRINETHRAM NEWS
Everything is set
  • పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు అన్నిటిని పాఠశాల స్థాయిలో చేరీవేత పూర్తి
  • మండలంలో సీఎం బ్రేక్ ఫాస్ట్ అండ్ మిల్క్ మొదటి దశలో మూడు పాఠశాలల్లో ప్రారంభం.
  • పాఠశాలల్లో పరిశుభ్రత మంచినీరు టాయిలెట్స్ కిచెన్ నిర్వహణపై ప్రత్యేకమైన శుద్ధ
  • ఎన్రోల్మెంట్ పెంపు కై ప్రత్యేకమైన చొరవ
  • ఈ సంవత్సరం ఒకటి నుంచి ఐదో తరగతికి కాకుండా 6 నుంచి 10వ తరగతికి కూడా వర్క్ బుక్స్.
  • త్వరలో కొత్త డిజైన్లతో యూనిఫార్మ్స్ పంపిణీ
  • విద్యా సంస్థల ప్రారంభం నుంచే విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేకమైన శ్రద్ధ .

Everything is Set : కూకట్పల్లి జూన్ 14 (త్రినేత్రం న్యూస్) : రేపు సోమవారం రోజున 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలన్నీ పునః ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రవీందర్ రాజు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన సంసిద్ధతను సమీక్షించడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థుల కు కావాల్సిన పాఠ్యపుస్తకాలను నోట్ పుస్తకాలను పాఠశాల స్థాయి వరకు చేర్చి విద్యార్థులకు 15వ తేదీ నుంచి అందజేయడానికి సంసిద్ధంగా ఉంచడం జరిగింది.

అదేవిధంగా ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ మరియు పాలు అందజేసే మొదటి దశ కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి మండలంలో మూడు పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూకట్పల్లి, మండల ప్రాథమిక పాఠశాల కుకట్పల్లి బాలికలు, మరియు మండల ప్రాథమిక పాఠశాల కుకట్పల్లి బాలుర, లలో 15వ తేదీ నుంచి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ ను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల ఆవరణలో తరగతిలో పరిశుభ్రత కిచెన్ షెడ్ ఎండిఎం యొక్క నిర్వహణ కావాల్సిన పరిశుభ్రత వంటి అంశాలపై విద్యార్థులకు తాగునీరు మధ్యాహ్న భోజనం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది.ఈ సంవత్సరం ఒకటి నుంచి ఐదో తరగతి కే కాకుండా ఆరు నుంచి పదవ తరగతి వరకు కూడా వర్క్ బుక్స్ ను ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది.

అదేవిధంగా నూతనంగా డిజైన్ చేయబడిన యూనిఫార్మ్స్ ని కూడా త్వరలో పంపిణీ చేయబోతున్నారు. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ మరియు అభ్యసన సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నట్లు మండల విద్యాధికారి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అందరూ కూడా అనుమతులు లేకుండా పాఠశాలలు లేదా తరగతులు నిర్వహించకూడదని, విద్యార్థుల యొక్క చైల్డ్ సేఫ్టీ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page