Vyalla Harish Reddy : ఖనిలో ఘనంగా గాంధీజీకి నివాళులర్పించిన వ్యాల్ల హరీష్ రెడ్డి

TRINETHRAM NEWS

గాంధీజీ బాటలో శాంతియుతంగా తెలంగాణ సాధించిన మహానుభావుడు కేసీఆర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మహాత్మా గాంధీ జయంతి, దసరా పండుగ సందర్భంగా గురువారం రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గల గాంధీ విగ్రహానికి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యాల్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ అహింస మార్గంలో భారత దేశ స్వాతంత్రం సాధనకు కృషి చేశారని, గాంధీ బాటలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడిగా కెసిఆర్ నిలిచిపోతాడని అన్నారు. స్వరాష్ట్ర తెలంగాణను పదేళ్లపాటు పాలించి రైతులు ప్రజలు సబండవర్గాలకు కెసిఆర్ తెలంగాణ ‘బాపు’లా నిలిచారని కొనియాడారు.

కాంగ్రెస్ మాయమాటలతో అమలు చేయలేని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను అరిగోశ పెడుతున్నారని బంగారు తెలంగాణకు మళ్ళీ కెసిఆర్ బాపు రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు గ్రామ రైతులు, ప్రజలు సిద్ధమయ్యారని హరీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి జాహిద్ పాషా, అనుముల కళావతి, పర్స స్వాతి, కడమండ శ్రీహరి, వంశీకృష్ణ , పోయిల రవి, కొండ సురేష్ , అల్లి గణేష్, గొర్రె నర్సింగరావు, శంకరయ్య, కరాటే రాములు, ఉదయ్, శ్రీనివాసరావు, ఎండి మోయిన్, బొట్లపోచం తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vyalla Harish Reddy paid tribute to Gandhiji in Khani

You cannot copy content of this page

Scroll to Top