జూలై 16, 2026
TRINETHRAM NEWS
Mutyalamma Jatara

Mutyalamma Jatara : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం. పెనుమూరు (త్రినేత్రం న్యూస్ ). జూన్ 24. మండలంలోని విడిదిపల్లి గ్రామంలో ముత్యాలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. మూడు రోజులు నుండి ప్రతిరోజూ ఉదయం అమ్మావారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించి, అంబలి పోశారు. మూడవ రోజైన మంగళవారం ఉదయం అమ్మవారిని అలంకరించి, పూజలు చేసి, అంబలి పోశారు. ఉదయం నుంచి పిళ్ళంగట్లు ఊదడం, డ్రమ్స్ వాయించడం, పలకలు కొడుతూ, బాణసంచా పేల్చుతూ ఆనందంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిపించారు.

ఈ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కలిపి అన్నదానం నిర్వహించడం జరిగింది. సాయంత్రం పొంగళ్ళు పెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు దేవళ్ళభాస్కర్, సూరమురళి, చంద్రగిరిగోపాల్, పురుషోత్తం, సూరశివ, ఉమామహేశ్వర్, మహేంద్ర, సుబ్బరాయులు, చెన్నకేశవులు, ఙ్ఞానేంద్ర, మాధవయ్య,మరియు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page