జూన్ 26, 2026
TRINETHRAM NEWS
20 students studying

20 Students Studying : అరకులోయ,జూన్ 24, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం మాదల పంచాయతీ పరిధిలోని దోమలజోరు మరియు రక్తకండి మోడల్ కాలనీ గ్రామాల్లో సుమారు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గత ఏడాదిలో గ్రామానికి పాఠశాల భవనం మంజూరైనట్లు అధికారులు ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు భవన నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం దోమలజోరు గ్రామం మరియు రక్తకండి మోడల్ కాలనీకి చెందిన సుమారు 20 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు (గుడిసె)లోనే విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. వర్షాకాలంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మంజూరైన పాఠశాల భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని గ్రామ ప్రజలు అప్పన్న, బొందయ్య , సింగన్న, చిన్నఅప్పన్న ,సీతన్నా సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. విద్యకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page