
బిఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్, కేతావత్ భిల్యా నాయక్
Kurmedu Mutyalamma Thalli Jatara : చింత పల్లి మార్చ్ 16, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడు ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ నాయక్, కేతావత్ భిల్యా నాయక్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతొ కన్నులపండువగా నిర్వహించే ఈ జాతర మహోత్సవం లో పాల్గోనడం శుభ పరిణామం అని అమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టెశ్వర్యాలతో ఆనందంగా మెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చెన్నమ్మ లాలయ్య, మాజీ ఎం పి టీ సి శ్వేత శ్రీశైలం గౌడ్,అండేకార్ అశోక్,సాగర్ రావు,నాదిరి రమెష్, కేతావత్ కిషన్ నాయక్,బీమయ్య, శ్రీకాంత్,నాదిరి శ్రీశైలం, జైపాల్ నాయక్,మోతిరాం,చిన్ను తదితరులు పాల్గొన్నారు

