TWJF : వికారాబాద్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్. కమిటీ కన్వీనర్ కె లాలయ్య

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వివక్ష, నిర్లక్ష్యం విడనాడాలి
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
-టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య
-వికారాబాద్ జిల్లాలో ఫెడరేషన్ అడ్ హక్ కమిటీ ఏర్పాటువికారాబాద్, ఫిబ్రవరి
జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష,నిర్లక్ష్యపు వైఖరిని విడనాడాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టిడబ్ల్యుజేఎఫ్వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన పాత్రికేయులు తమ సమస్యలపై రోడ్లపైకొచ్చి ఆందోళన చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల గడుస్తున్నా ఇప్పటివరకు జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉండిపోయిందని ధ్వజమెత్తారు. అక్రెడిటేషన్ కార్డుల్లో కోత లేకుండా 252 జీవోను సమూలంగా సవరించి,అర్హులైన
జర్నలిస్టులందరికీ కొత్త అక్రెడిటేషన్లు ఇవ్వాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం జర్నలిస్టుల కోసం ప్రకటించిన మ్యానిఫెస్టో అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల పట్ల గతంలో ఎన్నడూ లేని వివక్ష కొనసాగుతుందని, అక్రిడిటేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను గందరగోళం చేసి జర్నలిస్టులను ఆందోళన వైపుకు నెట్టారని అన్నారు.

ప్రభుత్వ వివక్ష, నిర్లక్ష్య వైఖరి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేంగా పోరాటం ఉధృతం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటి కో-కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనింగ్ కమిటి మెంబర్ మిద్దెల సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, వికారాబాద్ జిల్లా నాయకులు లాలయ్య,కృష్ణ, ఆంజనేయులు, నర్సింహులు, సత్యనారాయణ, రాజు,మాణిక్యం,అరుణ్, రామకృష్ణ,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అడ్ హక్ కమిటీ ఏర్పాటు టీడబ్ల్యూజేఎఫ్ వికారాబాద్ జిల్లా అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కన్వీనర్ గా కే.లాలయ్య, కో-కన్వీనర్లుగా ఎం.కృష్ణ, వై.ఆంజనేయులు, బి.నర్సింలు, సత్యనారాయణ, రాజు తదితరులు కమిటీలో ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vikarabad District Telangana Working Journalists Federation.

You cannot copy content of this page

Scroll to Top