ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్స్ ‘డే’ కు అనూహ్య స్పందన
జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ల మంజూరు మరియు పెన్షన్ ఉద్యోగ భద్రత కల్పించండి .
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం , ఆగస్ట్ 4 : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాజమండ్రి జిల్లా ఫెడరేషన్ యూనిట్ సభ్యులు సోమవారం కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల సాధనకై నినాదాలు చేస్తూ కదం తొక్కారు.14 డిమాండ్ల పై జర్నలిస్టులు నినాదాలు చేశారు. శాంతియుత నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కు సభ్యులు జి. గిరీష్ కుమార్(గుప్తా), వి. రవికుమార్, పి. వెంకటేశ్వరరావు( వెంకటేష్), వి. నాగేశ్వరరావు, బి.శ్రీనివాస్ కలెక్టర్ పి. ప్రశాంతి కి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి ప్రభుత్వం ఆమోదించాలని కోరారు.ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, నూతన అక్రిడేషన్లు,బీమా సదుపాయం,పింఛన్లు జారీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ సమస్యలు గుర్తించి జర్నలిస్టుల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని అలా కాని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు.ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు జర్నలిస్టుల సమస్యలను రాజమండ్రిలో కలెక్టర్ పి.ప్రశాంతి కు వివరించామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఏసీ.
బస్సుల్లో ప్రయాణించే సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, సమాచార శాఖ అన్ని విధాలా జర్నలిస్టులకు సహకరించాలని కోరారు.జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతికు సమర్పించిన వినతి పత్రంలో ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పింఛన్ సదుపాయం కల్పించాలని, రైల్వే పాసులు జారీ చేయాలని,జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, అక్క్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతి నిధ్యం కల్పించాలని,జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జె.సురేష్ , డి.శ్రీనివాస్, జి.సోమశేఖర్, ఎన్.సాయిరాం , సిహెచ్. త్రినాధ్, సిహెచ్ శివ నారాయణ , పి.వీరబాబు, వై. ఉమామహేశ్వరరావు (బాబి) , ఐ.దామోదర్, టి.పురుషోత్తమ రాజు, పి. సాయి, లైన్ జానీ రాయ్ , ఏ.ఆంజనేయులు, డీ.కే.దుర్గాప్రసాద్ , బి.సూర్య చందర్రావు , వై. శ్రీనివాస్ , , కె. దొరబాబు , కె. మధు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


