వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ అనుచరుల అరెస్టు.
దేవరకొండ ఏ ఎస్ పి మౌనిక.
దేవరకొండ అక్టోబర్ 17 త్రినేత్రం న్యూస్. అధిక వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ బాధితులు ఎవరు అధైర్య పడవద్దు అని, దేవరకొండ ఏ ఎస్ పి మౌనిక తెలిపారు. బాలాజీ నాయక్ ముఖ్య అనుచరుల నుంచి విలువైన ఆస్తులను ఇప్పటికే జప్తు చేసి సీజ్ చేసినట్లు ఆమె శుక్రవారం తెలిపారు. బాధితులు ఒత్తిడికి లోనై తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. బాధితులు తమ వద్ద ఉన్న పత్రాలతో గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని ఏ ఎస్ పి హా మీ ఇచ్చారు.
అధిక వడ్డీలకు పాల్పడుతున్న బాలాజీ ముఠాకు ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్య అనుచరులు ఏజెంట్లు అయినా చిరంజీవి, వినోద్, రమేష్, సురేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏ ఎస్ పి మౌనిక తెలిపారు. వారి ఆధీనంలో ఉన్న 6. 70 కోట్ల విలువగల బంగారం ,కార్లు, డాక్యుమెంట్లు సీజ్ చేశారు. బాధితులు ధైర్యంగా గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిందిగా ఏఎస్పీ మౌనిక కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


