వ్యవసాయ యాంత్రీకరణతో అధిక ఉత్పత్తులు. ఎం ఎల్ ఏ ,బాలు నాయక్.
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 18, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని రైతులకు సబ్సిడీ పైన మంజూరైన వివిధ రకాల వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి ఎం ఎల్ ఏ బాలు నాయక్ స్వయంగా పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఆధునిక వ్యవసాయంలో వ్యవసాయ యాంత్రీకరణ కీలకపాత్ర పోషిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు అందిస్తుందని,ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ రంగంలో సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం చేయడం మూలంగా తక్కువ దిగుబడితోపాటు అధిక ఖర్చు మూలంగా రైతు నష్టపోతున్నారని తెలిపారు.కృత్రిమ మేదస్సు ద్వారా తయారైన యంత్రాలు వాడకం ద్వారా సాగు వ్యయం తగ్గడంతో పాటు ఉత్పత్తుల పెరుగుతున్నాయని , ప్రతి యంత్ర పరికరం పై ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా దేవరకొండ డివిజన్ కి 1759 పనిముట్లు గాను 1కోటి 16 లక్షల రూపాయల సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారని అన్నారు. అదేవిధంగా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామానికి ఒక్క వాలంటరీ నియమించాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏ డీ ఏ శ్రీలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, ఎం ఎ ఓ లు రవి కుమార్, రహేన, లక్పతి, యాదగిరి, రాజు, శ్రావణ కుమారి, రావుల పాండు, డిప్యూటీ చైర్మన్ గో జువేరియా తబస్సుం,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, పి ఎ సీ ఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మరుపాకల అరుణ సురేష్ గౌడ్,కౌన్సిలర్లు హన్మంత్ సాయిచంద్ర గౌడ్, అజయ్ , యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


