ANDHRAPRADESH

Mohan Babu : కిడ్నాప్ కేసు: మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు

TRINETHRAM NEWS

విద్యార్థుల కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం

ప్రధాన నిందితుడితో కాల్స్, మెసేజ్‌లపై ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉందని వెల్లడి

కేసు కొట్టివేత పిటిషన్‌పై విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా

Trinethram News : విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ప్రముఖ సినీ నటుడు, మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్స్‌లర్‌ మంచు మోహన్‌బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేయాలన్న ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఈ వ్యాజ్యంపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు. కిడ్నాప్ ఘటనకు ముందు, ఆ తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైన యూనివర్సిటీ పీఆర్‌వో సతీశ్‌తో మోహన్‌బాబు ఫోన్‌లో మాట్లాడారని, మెసేజ్‌లు కూడా పంపుకున్నారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kidnapping case: Mohan Babu faces setback in High Court

You cannot copy content of this page