UPI Transactions : యూపీఐ లావాదేవీలు రూ. 1000 దాటితే ఛార్జీలు కట్ అవుతాయా? ఎన్‌పీసీఐ క్లారిటీ ఇదే!
మనదేశంలో ప్రస్తుతం యూపీఐ ద్వారా చెల్లింపుల సేవలు ఎక్కువగా అయ్యాయి.
Trinethram News : ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం మంది లిక్విడ్ క్యాష్ బదులుగా ఈ సేవలనే ఎంచుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా యూపీఐ సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద మాల్స్ వరకు యూపీఐ సేవలు పెద్ద ఎత్తున నిర్వహించడంతో సులభంగా ఈ డిజిటల్ చెల్లింపుల పెరిగిపోయాయి.
అయితే మన దేశంలో యూపీఐ వినియోగం ఎక్కువగా పెరగడంతో రోజు కొన్ని లక్షల మంది లావాదేవీలు జరపడంతో ఇక వెయ్యి రూపాయలు దాటితే యూపీఐ ద్వారా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
అయితే దీనిపై ఎన్‌పీసీఐ స్పందించింది. వ్యక్తుల మధ్య.. వ్యక్తులు, వ్యాపారం మధ్య జరిగే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని సమాచారం. ఇలాంటి వార్తను నమ్మకూడదు అని చెబుతోంది. ప్రస్తుతం డిజిటల్ ఇండియా యుగంలో చాలా మంది యూపీఐ చెల్లింపులపైనే ఆధారపడ్డారు.
ఎక్కువగా గతంలో లిక్విడ్ క్యాష్ ఉపయోగించడం వల్ల సమస్య కూడా ఏర్పడేది. చేతిలో ఫోన్ ఉంటే చాలు ఎక్కడైనా వెళ్లి షాపింగ్ సులభంగా చేయవచ్చు. రవాణా, షాపింగ్ ఇది కేవలం ఈ యూపీఐ లావాదేవీలతో జరిగిపోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ వార్త వైరల్ అవుతూ వస్తుంది. అయితే కేవలం సాధారణ కష్టమర్లకు బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు డబ్బు పంపించినంత మాత్రానా ఈ ఛార్జీలు వసూలు చేయావని ఎన్‌పీసీఐ తెలిపింది. అయితే ఈ గందరగోళానికి ప్రధాన కారణం పేటీఎం అమెజాన్ లేదా ఫోన్ పే వాలెట్‌లో డబ్బును రీఛార్జ్ చేస్తే దుకాణా దారుడికి రెండు వేల కంటే ఎక్కువ చెల్లింపులు చేస్తే రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
దాన్ని కస్టమర్ భరించరని గుర్తుంచుకోవాలి . ఇది బ్యాంకు కంపెనీ మధ్య జరుగుతోంది. ఇంక చాలామందికి ప్రతిరోజు యూపీఐ ద్వారా గరిష్టంగా లక్ష వరకు లావాదేవీలు చేసే అవకాశం ఉంది. కొన్ని ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు మాత్రం ఐదు లక్షల వరకు చెల్లించవచ్చు. అయితే ప్రధానంగా మీరు యూపీఐ ద్వారా లావాదేవీలు చేసినప్పుడు పిన్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. మోసానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

