దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 18, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని ముదిగొండ కమలాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకొని, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రత్యేక పూజలు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నిర్వహించారు.
ఈ సందర్భంగా…..రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలని వీరభద్ర స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతూ సమాజంలోని ప్రతి వర్గానికీ ప్రయోజనం చేకూరాలని, ప్రజా ప్రభుత్వంపై స్వామివారి కరుణాకటాక్షాలు నిలవాలని ఆకాంక్షించారు.
దేవరకొండ ప్రజలందరి జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సమృద్ధిని నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


