PM Modi : ఇకపై ఇజ్రాయెల్‌లోనూ యూపీఐ సేవలు

TRINETHRAM NEWS

Trinethram News : భారత్ – ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ప్రతి సవాల్‌ను తట్టుకుని కాలపరీక్షకు నిలిచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలపై ఏర్పడిన ఈ బంధం ఎంతో బలమైనదని పేర్కొన్నారు.

ఇరు దేశాల భాగస్వామ్యాన్ని ‘శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

జెరూసలేంలో గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య పలు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) జరిగాయి.

కృత్రిమ మేథ (AI), క్వాంటం, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాల్లో సహకారాన్ని వేగవంతం చేసేందుకు ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ పార్ట్‌నర్‌షిప్’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌లో యూపీఐ సేవలను వినియోగించేందుకు ఒప్పందం కుదరడం సంతోషంగా ఉందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

UPI services to be available in Israel

You cannot copy content of this page

Scroll to Top