యోగ అవార్డు గ్రహీత డి ఎల్ పి ఓ రాజుకి చిరు సత్కారం…
ఆలమూరు: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆలమూరు మండల పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో యోగ డే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించి ప్రజలను ఉత్తేజపరిచిన డి ఎల్ పి ఓ రాజుకి కలెక్టర్ చేతుల మీదగా ఉత్తమ ప్రతిభ అవార్డును ప్రకటించి ప్రభుత్వం ఘనంగా సత్కరించి అభినందించింది. అందరి మన్ననలు పొందిన డి ఎల్ పి ఓ రాజుకి పంచాయతీ కార్యదర్శులు కూడా దుస్సాలువా కప్పి పూలమాలతో సత్కరించారు.
ఎంపిడిఓ మాట్లాడుతూ అందరి సహకారంతో ఇంతటి గౌరవం దక్కిందని నాతో పాటు మీరు భాగస్వాములై యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగామని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని డిఎల్పిఓ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ సిబ్బందితోపాటు మండల పంచాయితీ కార్యదర్శులు వేణి. దేవి. కృష్ణ. సాయి ప్రసాద్. అశోక్. ప్రకాష్ అయ్యన్న. వెంకట్ రెడ్డి. శబరి. వీరమాత. వల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


