త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. 30-06-2025 ములకలపల్లి మండలంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ ములకలపల్లి మండలంలో పలు గ్రామపంచాయతీలలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు కోట్ల అరవైఎనిమిది లక్షలతో పూర్తయిన అభివృద్ధి పనులైన సీసీ రోడ్లు గ్రామపంచాయతీ భవనాలు బీటీ రోడ్లు అంగన్వాడీ భవనాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపలు చేశారు. ములకలపల్లి రైతువేదిక నందు క్రిస్టియన్ మైనారిటీ ద్వారా మంజూరైన కుట్టుమిషన్లు లబ్ధిదారులకు అందించారు. అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాదీముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వచ్చిన చెక్కులను బాధితులకు అందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోరంపల్లి చేన్నారావు ,ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిమే వంశీ మరియు NSUI అధ్యక్షులు గుంట్రూ సాయి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


