జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట : కేశవరం గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్థానికులు చేపట్టిన ఉద్యమానికి పీ.డీ.ఎస్‌.యు (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం) విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించింది. స్కూల్‌ భద్రత కోసం అత్యవసరంగా నిర్మించాల్సిన ప్రహరీ గోడ కోసం గత 74 రోజులుగా జరుగుతున్న రిలే నిరాహారదీక్ష చేస్తున్న వల్లూరి శ్రీ వాణికి సంఘీభావం ప్రకటించింది.

పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్ధూ మాట్లాడుతూ విద్యార్థుల భద్రతకు గోడ అనివార్యమని, స్కూల్‌ అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం సరికాదని, టీచర్స్ లను నియమించాలని, అదనపు గదులు నిర్మాణం, హైస్కూల్ లో కుక్కలను, పందులను రాకుండా చేయాలని పీడీఎస్‌యు నాయకులు పేర్కొన్నారు. తక్షణమే ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు వెంకట్, ఎస్.ఎఫ్. ఐ నేత జోసఫ్, పీ. డీ.ఎస్.యూ నాయకులు కె. సురేష్, రామ దుర్గ రావు, సందీప్,వీరబాబు, సత్య వర్థన్, శ్రీనివాస్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PDSU supports the resolution

You cannot copy content of this page