Yoga Days : యోగా దినోత్సవాలు

TRINETHRAM NEWS

తేదీ : 21/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎన్టీఆర్ స్టేడియంలో 11వ అంతర్జాతీయ యోగా ఉత్సవాలను ఘనంగా జరిపారు. అధికార పట్టణ ప్రముఖులు, ప్రపంచ రికార్డు సృష్టిస్తూ విశాఖలో యోగ దినోత్సవాలు జరగడం గర్వకారణం అని తెలిపారు. యోగ ఆరోగ్యానికి తారక మంత్రమని, వ్యక్తిత్వ క్రమశిక్షణకు మారుపేరని , యావత్ ప్రపంచం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా భారత ప్రధాని మోదీ సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం లో దినోత్సవాలు జరగడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.
అదేవిధంగా విద్యార్థులు, క్రీడాకారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొని ఆసనాలు చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. యోగ అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని , క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందన్నారు. శారీరక ప్రశాంతత పాటుగా అనేక రుగ్మతులకు దూరం కావచ్చు అన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిక జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకుంటే అనేక ప్రయోజనం కలుగుతాయని , టెక్నాలజీలతో యోగాలను మిలితం చేసే ప్రజలకు మరింత చెరువు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే రాము అనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Yoga Days

You cannot copy content of this page

Scroll to Top