Janasena : అల్లూరి జిల్లా : మార్చి 14: (త్రినేత్రం న్యూస్); జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా , ఓ నూరులో గిరి పుత్రుల మధ్య ఆ పార్టీ పతాకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అంతకుముందు అక్కడి గ్రామాలలో అడవి తల్లి బాట, రోడ్లను జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కొళాయిలను పరిశీలించారు. అంగన్వాడి సెంటర్ కి వెళ్లి చిన్నారులతో ముచ్చటించి బ్యాగులను పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను అందజేశారు.


