తేదీ : 21/12/ 2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి మినీ బస్టాండ్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమంలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా..రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ,నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. అదేవిధంగా పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి. బాలరాజు జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామం పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయన కూడా పిల్లలకు పోలియో చుక్కలు వేసి, పోలియో వంటి ప్రాణాంతక వ్యాధిని నిర్మూలించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


