తేదీ : 16/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, తాడువాయి గ్రామంలో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ పల్లెనిద్రను నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటి పరిష్కార దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల ప్రజా సమస్యలనేవి త్వరగా తెలుసుకోవచ్చని అన్నారు. కులమత పార్టీ భేదం లేకున్నా అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు తన స్వాగతం పలికి పల్లె నిద్ర కార్యక్రమాన్ని కూట మి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. కె. సత్తిరాజు పంచాయతీ అధ్యక్షులు , కె. వెంకటేశ్వరావు ఉపాధ్యక్షులు, పి. నాని కె. శ్రీనివాసరావు, పి. అనిల్, శ్రీనివాస్ రావు, యన్. క్రాంతి, పి. మహేంద్ర, యన్. శ్రీను , వి. రాంబాబు, యన్. కాంతారావు ఉపాధ్యక్షులు , యు. పుల్లారావు గుడి చైర్మన్. తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


