ఆపదలో ఆదుకున్న, తాడాల, చక్రవర్తి
త్రినేత్రం న్యూస్, కడియం : ఆపదలో ఆదుకోవడాన్ని మించిన ఆత్మ సంతృప్తి మరొకటి లేదని టివిసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు.
రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం, కడియం మండలం, దోసలమ్మ కాలనీలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో యాల్లంశెట్టి సముద్రుడు లక్ష్మి లకు చెందిన ఇల్లు పూర్తిగా కాలిపోయి కట్టుబట్టలతో మిగిలారు.
విషయం తెలుసుకున్న టీవీసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి సోమవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. 25 కేజీల బియ్యం, దుప్పట్లు, కొత్త బట్టలు మరియు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
ఈ కార్యక్రమంలో తాడాల కృష్ణ కుమార్, కొత్తపల్లి శివాజీ, సాపిరెడ్డి కామేష్, చిరుకూరి రామకృష్ణ, గణేశుల చక్రవర్తి, మార్గాని బలరాం, తూపాటి వరాలు, తూపాటి దుర్గాజీ, గాడి శ్రీను, బత్తుల రవి, బత్తిన శ్రీధర్, చలపరెడ్డి మహేష్, వజ్రపు రామరాజు, కరణం లోవరాజు, పచ్చిపులుసు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


