త్రినేత్రం న్యూస్.. కడియం : గోసాలల సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని టివిసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు. కడియం శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో గల గోసాల నిర్వహణ నిమిత్తం సోమవారం తాడాల విష్ణు చక్రవర్తి, రాజరాజేశ్వరి దంపతులు ఇరవై ఐదువేల రూపాయల విరాళం అందించారు. బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు చేతుల మీదుగా, గోవుల పోషణ నిమిత్తం విరాళాన్ని అందించినట్లు తాడాల చక్రవర్తి తెలిపారు.
గిరజాల బాబు మాట్లాడుతూ గోవుల పోషణ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని, గోవులను పెంచే ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉండవని తెలిపారు. ఈకార్యక్రమంలో అయితిరెడ్డి అయ్యప్ప, గణేషుల చక్రవర్తి, పున్నమి రాజు వీర్రాజు, కుసునూరి సత్యనారాయణ (బాబులు), మర్రి చందర్రావు, పడాల గోవిందు, పిండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


