త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 6. తూర్పుగోదావరి జిల్లా కడియం : పేదలు, అనాధలు మరియు దివ్యాంగుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మనస్సుకు ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చిందని టివిసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి అన్నారు. కడియం మండలం, బుర్రిలంక గ్రామానికి చెందిన టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, శ్రీ ఈశ్వరఫామ్ నర్సరీ అధినేత, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా సోమవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధవలేశ్వరం స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ కు వెళ్లి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం బొమ్మూరు లెప్పర్సీ కాలనీలో వ్యాధి గ్రస్తులకు భోజనాలు అందజేశారు. కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ధవలేశ్వరం పలుకు బధిరుల ఆశ్రమ పాఠశాలలో పండ్లు, బ్రెడ్స్ అందజేశారు. అనంతరం బుర్రిలంకలో తన నర్సరీ నందు సుమారు 200 మంది పేదలకు నూతన వస్త్రాలను అందజేసి, విందు భోజనం ఏర్పాటు చేసారు. ఆయా కార్యక్రమాల్లో చక్రవర్తి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు చక్రవర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


