Trinethram News : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని భారతదేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. అలాగే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్ ఈ దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఈ సమయంలో ప్రధాని మోదీకి, భారత ప్రజలకు అండగా నిలుస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారత్‌కు అండగా నిలిచారు. ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు పుతిన్. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


