Dommeti Venkata Reddy : శెట్టి బలిజల పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు

TRINETHRAM NEWS
Tributes paid to Shetty Balijala's father Dommeti Venkata Reddy

Dommeti Venkata Reddy : త్రినేత్రం న్యూస్, శెట్టి బలిజల పితామహుడు, గొప్ప సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఈ కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శెట్టిబలిజ సమాజ అభ్యున్నతికి, అణగారిన వర్గాల అభివృద్ధికి మరియు విద్యా విస్తరణకు విశేషంగా కృషి చేసిన మహానీయుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కూడా తన వంతు పాత్ర పోషించారని, వయోజన విద్య అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.
ఇటీవల ఆయన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏఆర్) ఎల్. చెంచి రెడ్డి, డీఎస్పీ (ఎస్‌బీ) బి. రామకృష్ణ, డీఎస్పీ (ఏఆర్) రవికుమార్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top