
జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా పూల బొకే అందజేత
R. Siva Ramudu : త్రినేత్రం న్యూస్, నూతనంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)గా సోమవారం ఉదయం స్థానిక ఆర్డీవో కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించిన ఆర్. శివ రాముడు అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కు పూల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆర్. శివ రాముడిని అభినందించారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేయాలని సూచించారు.
ఆర్. శివ రాముడు 2007లో అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా తొలి నియామకం పొందారు. అనంతరం పదోన్నతిపై తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తహసిల్దార్ గా బెతంచర్ల, డోన్, ఆదోని ప్రాంతాలతో పాటు కర్నూలు కలెక్టరేట్‌లో కూడా వివిధ హోదాల్లో సేవలందించారు. అదేవిధంగా కలెక్టర్ ఏవోగా మరియు భూసేకరణ విభాగాల్లో కూడా పని చేసి విశేష అనుభవం సంపాదించారు.
ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టరేట్ లో రెవెన్యూ క్లినిక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, పలువురు జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, తదితరులు అభినందనలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

