తేదీ : 25/06/2025. కర్నూలు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆదోనిలో తాజాగా విషాదం చోటు చేసుకోవడం జరిగింది. రెండవ తరగతి చదువుతున్న విద్యార్థి అభిరామ్ (8) పాముకాటుకు గురై మృతి చెందాడు. బాలుడు ఆకలేస్తుంది అన్నం పెట్టమని ఏడ్చుకుంటూ వచ్చి తన తల్లి ఒడిలో కుప్పకూలాడు. కళ్ళ ఎదుట విలవిలలాడుతున్నటువంటి తమ బిడ్డను చూసి ఆమె తల్లడిల్లిపోయింది . ఆకలి తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్ళావా కొడకా అంటూ ఆ తల్లి విలపించింది. దీంతో అక్కడున్న వారంతా కన్నీరు మున్నీరయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


