తేదీ : 25/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జీలుగుమిల్లి, టీ నర్సాపురం మండలం లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంటర్వ్యూ విభాగంలో మాట్లాడుతూ విద్యార్థులు కు క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, మరియు క్రీడలు, అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద సన్నబియ్యము అన్నము, ఆకుకూరలు, కూరగాయలు మంచి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని, రోజు విడిచి రోజు రాగి జావా, బెల్లం వేరుశనగతో తయారుచేసిన చిక్కీలు వంటివి అందిస్తున్నామని తెలపడం జరిగింది.
ప్రభుత్వం సమయం ప్రకారం పాఠశాలలు నడుపుతున్నామని, అదే విధంగా విద్యార్థులందరూ కు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, సంబంధిత మెటీరియల్స్ మొత్తం అందించమని చెప్పడం జరిగింది. ప్రతి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, కొత్తగా అడ్మిషన్ లు ఎన్ని అయినాయో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు రాజవరం యస్. విక్టోరియా రాణి, మక్కిన వారి గూడెం .యన్. రాంబాబు రెడ్డి, సీతంపేట. కె. విజయ్ కుమార్, గౌరీ శంకరపురం కె. మహేష్ కొల్లి వారి గూడెం.యం. అనిత, చింతలపూడి మండలం, యర్రగుంటపల్లి.కె. ప్రభాకర్, యల్. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో గీతిక ఐదు వందల ఒకటి మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని సాధించిందని, తెలిపారు. విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు, ప్రజలందరూ కూడా కూటమీ ప్రభుత్వానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


