కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ…
మండపేట త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. ఏ సమస్యలు ఉన్నా నేరుగా తనకు తెలియజేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఆదేశాల మేరకు మండపేట పట్టణంలో స్ధానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం జరిగింది. అందులో భాగంగానే కార్యకర్తల సమస్యలు తెలుగుకొనుటకు గాను మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే వేగుళ్ళ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ పార్టీకోసం కష్టపడిన ప్రతీ ఒక్క కార్యకర్తకు న్యాయం చేయడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు, ముందుకువెళ్తున్నారన్నారు. అర్హులైన వారికే పార్టీ పదవులు కల్పిస్తామన్నారు. రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ కార్యకర్త మరింత చురుకుగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, రాష్ట్ర ఎస్.సి కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు, మల్లిపూడి గణేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నరు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


