Backache Day : జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమం

TRINETHRAM NEWS

కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోని విఫలమైంది..

మండపేట : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు దూరమైందని, సామాన్యులు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు. శుక్రవారం అంగరలోని వైఎస్సార్‌సీపీ మండల కార్యాలయంలో గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. జూన్ 4న కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ‘వెన్నుపోటు దినం’గా పాటించాలని పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపును అమలు చేసేందుకు దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, సర్పంచ్‌లు వాసా కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు అడ్డాల శ్రీనివాస్, మేడిశెట్టి దుర్గారావు, నాయకులు గూటం సత్యనారాయణ, తిరునాతి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తోట త్రిమూర్తులు మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు సమయానికి ముందస్తుగా పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం అందించామన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఎన్నికల్లో సాంకేతికంగా ఓడినప్పటికీ, వైఎస్సార్‌సీపీ ప్రజల గుండెల్లో నిలిచిందని, ప్రతి ఇంటికీ లబ్ది చేకూర్చిన ధైర్యం తమకు ఉందన్నారు. కూటమి నాయకులకు ప్రజల ముందు తాము చేసిన మేలు చెప్పుకునే ధైర్యం లేదన్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని, మద్యం షాపులను తగ్గించి గ్రామాల చివరలో మాత్రమే నిర్వహించామన్నారు. కానీ, కూటమి పాలనలో బడులు, గుడులు, మహిళా సమూహాల సమీపంలోనూ మద్యం షాపులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో హామీలతో ప్రజలను మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని, రెండు పంటలకు సాయం, విద్యార్థుల తల్లిదండ్రులకు ‘తల్లికి వందనం’ సాయం అందలేదన్నారు.

సీఎం చంద్రబాబు అప్పులు తెచ్చినప్పటికీ, ఆ డబ్బు ప్రజలకు చేరలేదని, వైఎస్ జగన్ హయాంలో అప్పులు నేరుగా ప్రజలకు లబ్ధి చేకూర్చాయని తెలిపారు. ఏడాదిలోనే కూటమి పాలనా వైఫల్యం ప్రజలకు అర్థమైందని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రజలకు భరోసాగా నిలవాలని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించాలని పిలుపునిచ్చారు. జూన్ 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో నాయకులు సిరిపురపు శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు పలివెల మధు, యర్రంశెట్టి నాగేశ్వరరావు, సర్పంచ్ కుక్కల వీరన్న, నాయకులు తిరునాతి వెంకటేశ్వరరావు, పెద్దింశెట్టి రామస్వామి, అశిరమూర్తి, కవల శ్రీను, పాలింగి కిశోర్, పాలింగి శ్రీనివాస్, కట్టా మురళి, అంగాని నూకరాజు, పోలిశెట్టి గణేష్, కొండేటి వెంకటేశ్వరరావు, సలాది వీరబాబు, వాసంశెట్టి విష్ణు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Backache Day program on

You cannot copy content of this page

Scroll to Top