అనపర్తి : త్రినేత్రం న్యూస్. పెదపూడి మండలం, దోమాడ గ్రామంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల గురించి 14 రోజుల పాటు కనీస దృష్టి కూడా పెట్టని, రామకృష్ణారెడ్డి, ఇప్పుడు మాత్రం తలవంచి వారి వద్దకే రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అన్నారు.
బాధితుల కష్టాలను చూసి వెంటనే స్పందించిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నేతలు అందరూ కలిసి అండగా నిలిచారు. వారి మద్దతుతో మేము సాధించిన ఈ మొదటి విజయం, అహంకారంతో ఊగిపోయిన, రామకృష్ణారెడ్డి కళ్ళకు కనువిప్పేలా చేసింది.
ఈ పోరాటానికి సహకరించిన వైసీపీ నాయకులకు,కార్యకర్తలకు, వివిధ సంఘాల నాయకులకు అందరికీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ధన్యవాదాలు తెలియచేశారు. ఇదీ మన పోరాటానికి మొదటి విజయం అని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


