Crime News : ఆస్థి కోసం సహోదరుని పై హత్య ప్రయత్నం చేసిన అన్న
తెల్లవారుజామున కత్తితో దాడి …ముగ్గురికి తీవ్ర గాయాలు
నిందితున్ని అరెస్ట్ చేసిన గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు
త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి.. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి మార్కండేయ కాలనీలో రెండు కుటుంబాల మధ్య ఆస్థి, ఇతర వివాదాల కారణంతో కత్తి తో దాడి చేసి హత్యాయత్నం కి పాల్పడిన నిందితుని అరెస్ట్ వివరాలు ఏసీపీ కార్యాలయం లో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్,గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి కలిసి అరెస్ట్ వివరాలు వెల్లడించారు.
నిందితుని వివరాలు: గాడిచెర్ల రామ్ దూత్, తండ్రి సారయ్య, 28yrs, నివాసం హ.నో.21-2-85, మార్కండేయ కాలనీ, గోదావరిఖని.
స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు
1). నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తి
2). 01 మొబైల్ ఫోన్
రక్తపు మరకలు ఉన్న బట్టలు
వివరాల్లోకి వెళితే…
నిందితుడు గాడిచెర్ల రామ్ దూత్, 27 yrs, బిటెక్ చదివి ప్రస్తుతం సోరియాసిస్ చర్మ వ్యాధితో ఇంట్లోనే ఉంటున్నాడు. నిందితుని తాత రాయమల్లు కట్టించిన ఇంటిలో పెద్ద కుమారుడు సారయ్య కుటుంబం ఒక భాగంలో ఉండగా, చిన్న కుమారుడు శ్రీనివాస్ కుటుంబం మరో భాగంలో ఇద్దరు కుమారుల పక్కపక్కనే చెరో భాగంలో నివసిస్తున్నారు. శ్రీనివాస్ పదకొండు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన భార్య సుమిత్రి, కుమారుడు ప్రణయ్ (22), కుమార్తె సువర్చలా, సుమిత్రి తల్లి కొమురమ్మ అక్కడే ఉంటున్నారు.
నిందితుడు రామ్ దూత్ తండ్రికి ఫిట్స్, బీపీ సమస్యలు ఉండగా, తల్లికి గుండె సమస్యలు ఉన్నాయి. పిన్ని సుమిత్ర కిరాణా దుకాణంలో సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా అమ్ముతుండగా, వాటి వాసన మరియు సిగరేటు అక్కడే త్రాగడం వల్ల వచ్చే పొగ కారణంగా తమ ఆరోగ్యం దెబ్బతింటోందని రామ్ దూత్ కుటుంబం పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై తరచూ గొడవలు జరిగాయి అదేవిదంగా నిందితుని రామ్ దూత్ తండ్రి, చిన్న నాన్న (బాబాయ్ ) కుటుంబ ఆస్తి తనకే వస్తుందని భావించి బాబాయ్ కుటుంబ సభ్యులను చంపాలని రామ్ దూత్ నిర్ణయించుకొని, గత సంవత్సరం అక్టోబర్ 5న అమెజాన్ ద్వారా కొబ్బరి కత్తి కొనుగోలు చేసి ఇంట్లో దాచుకున్నాడు. హత్యకు గల కారణాలను ఒక నోటు బుక్కులో కూడా రాసుకున్నాడు.
నిందితుని పథకం లో భాగంగా ఈరోజు తేది 20-02-2026 తెల్లవారుజామున సుమారు ఉదయం 5 గంటల సమయంలో, పిన్ని సుమిత్ర నిద్ర లేచి , తలుపులు తీసి , బాత్రూం కు వెళ్లగా రామ్ దూత్ కత్తితో పక్కింట్లోని బాబాయ్ ఇంటికి వెళ్లి పడుకుని ఉన్న ప్రణయ్పై ఛాతీ, భుజాలు, మెడపై దాడి చేశాడు. అరుపులు విని అడ్డుకున్న కొమురమ్మకు ముఖం, చెవి, చేతిపై గాయాలు అయ్యాయి. తరువాత సుమిత్రిపై కూడా ముఖం, చేతులపై కత్తితో దాడి చేసి తీవ్ర గాయాలు చేశాడు .
అరుపులు విని అక్కడికి వచ్చిన చుట్టూ ప్రక్కన వ్యక్తులు నిందితుడిని అడ్డుకుని కత్తి లాక్కొన్నారు. దాడి సమయంలో బట్టలపై రక్తం పడటంతో బట్టలు మార్చుకుని రామ్ దూత్ ఇంటి నుండి పారిపోయాడు. వారిని మొదటగా గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్ కు తర్వాత కరీంనగర్ One హాస్పిటల్ కు తీసుకుపోయి అడ్మిట్ చేశారు నిందితుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ వద్ద దాక్కొని బస్ స్టాండ్కు వెళ్తున్నాడు అనే నమ్మదగిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ ఇంద్రాసేనా రెడ్డి, అక్కడకి వెళ్లి నిందితుడిని పట్టుకొని అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేసి గౌరవ కోర్ట్ లో హాజరు పరిచి రిమాండ్ కి తరలించడం జరిగింది అని ఏసీపీ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

