Petition to RDO : ఆర్డీవోకు వినతి పత్రం అందజేత

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి) మార్చి 13 త్రినేత్రం న్యూస్. సింగరాజుపల్లి గ్రామంలో ద్వేషం షాపులో బయోమెట్రిక్ నమోదు సౌకర్యం లేకపోవడంతో రేషన్ సరుకులు తీసుకోవడంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనిసింగ రాజు పల్లి గ్రామ మాజి సర్పంచ్ పొనుగోటి రవీందర్ రావు ఆర్డిఓ రమణారెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ప్రస్తుతం సింగరాజుపల్లి రేషన్ షాపులో బయోమెట్రిక్ నమోదు సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల వలస వెళ్లిన కూలీలు రేషన్ సరుకులు పొందలేకపోతున్నారు, దీనివలన వారు ఆహారభద్రతకు దూరమవుతున్నారు కావున మా గ్రామంలోని రేషన్ షాపులో తక్షణమే బయోమెట్రిక్ నమోదు సౌకర్యం కల్పించాలని పూర్వకంగా ఆర్డిఓ రమణారెడ్డి నీ కోరడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Submission of petition to RDO

You cannot copy content of this page

Scroll to Top