MLA Nenavath Balu Naik : అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

TRINETHRAM NEWS

అందమైన బాల్యాన్ని ..అంతకుమించిన ఆనందంగా ఉండేలా చేద్దాం..! పిల్లలని బడికి పంపి,భావి భారతానికి శక్తిని అందిద్దాం..!! గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లతో గుండెల నిండా ధైర్యాన్ని ఇస్తున్న పాలన. ప్రజా పాలనలో పథకాల పండుగ .. ప్రతిరోజూ పండగ. ప్రజల నమ్మకానికి న్యాయం చేయగలిగే నాయకత్వమే మా ప్రజా పాలన యొక్క పునాది.

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.

దేవరకొండ పట్టణంలోని 10వ వార్డులోని అయ్యప్ప నగర్ కాలనిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి శంకుస్థాపన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చేశారు. అనంతరం పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, నోట్ బుక్, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. వరుసగా జరుగుతున్న శంకుస్థాపనలతో ప్రజల్లో విశ్వాసం బలపడుతోందని, ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేస్తున్నామని ,
ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు చిరకాల స్వప్నం నెరవేర్చడం నా బాధ్యత అని పేర్కొన్నారు.

ఇది దేవరకొండ నియోజక వర్గ ప్రజల రుణం తీర్చుకునే తరుణమని వారి ఆశల్ని వమ్ముచేయకుండా దేవరకొండ నియోజక వర్గంలో 20,000మంది పేదలకు ఇండ్లు అందించాల్సిన బాధ్యత నా భుజాలపై ఉందని ,

వచ్చే 5 ఏళ్లలో ప్రతి అర్హుడికి ఇల్లు ఇవ్వాలన్నది నా ముఖ్య సంకల్పం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థ సమూల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని అన్నారు. బాలల సంక్షేమం ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. తదనంతరం భవిత పాఠశాల విద్యార్థులకు ఆప్యాయంగా పలకరించి, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,పట్టణ కౌన్సిలర్లు,మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు,మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు,అధికారులు, ఉపాద్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The welfare of all

You cannot copy content of this page

Scroll to Top