MLA Balu Naik : పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న దేవరకొండ ఎం ఎల్ ఏ.

TRINETHRAM NEWS

Ro వాటర్ ప్లాంట్, ఇందిరమ్మ ఇండ్లనిర్మాణపనులకు శంకుస్థాపన. అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమాల్లో పాల్గొన్న ఎం ఎల్ ఏ బాలు నాయక్.

దేవరకొండ జూన్ 12 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని సూర్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలో గల భాన్య బావోజీ తండాలో నూతనంగా ఏర్పాటు చేసిన *RO వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై,RO వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం దేవరకొండ మండలంలోని సూర్యాతండా గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. RO వాటర్ ప్లాంట్ ను గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇల్లు లేని పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి ల‌బ్దిదారుల‌ దీవెనలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి అని అన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది,పేదవాడికి ఏది ముందు అవసరమో అది ఇస్తున్నాం.

పేదవాడి కళ్లలో చిరునవ్వు చూడాలని కాస్త ఇబ్బందులు ఎదురు అయినా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాం అని అన్నారు. “ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల కలను నిజం చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వ ఇండ్ల పథకం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు పోతోందని ఆయన అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు ఒక సైనికునిగా పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సూర్యాతండలో అమ్మమాట – అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు కృష్ణయ్య, ఎంపిడిఓ డానియల్, హౌసింగ్ DE నాగేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, మాజీ సర్పంచులు నారాయణ,నర్య నాయక్,శివయ్య,జగన్, లచ్చిరామ్,యాదయ్య,మీడియా & కమ్యూనికేషన్ జిల్లా కన్వీనర్ నర్ర బాలు , పంచాయతీ కార్యదర్శి పద్మ,కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటయ్య,రవి నాయక్,కిషన్ నాయక్,గోపాల్ నాయక్, విద్యుత్ కాంట్రాక్ట్ సంతోష్ రాథోడ్, అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Devarakonda MLA participated in

You cannot copy content of this page

Scroll to Top