ప్రభుత్వ బడులను బలోపేతం చేయండి.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాపిరెడ్డి.
డిండి(గుండ్లపల్లి) మే 26 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజలకు తమ పిల్లలను ప్రభుత్వ బడులలోనే చదివించాలని, మన ఊరిలో ప్రభుత్వ బడి ఉండగా ప్రైవేటు పడేందుకు దండగ అని జిల్లా పరిషత్ డిండి ప్రధానోపాధ్యాయులు పాపిరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు తో పాటు ఉపాధ్యాయుల బృందం తల్లిదండ్రులను చైతన్యం చేయడం జరిగింది. తమ పిల్లలను ప్రభుత్వ బాడులలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ బడులలోనే అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన చేయించడం జరుగుతుందని, మధ్యాహ్న భోజన వసతి ప్రభుత్వం కల్పిస్తుందని, మరియు పాఠ్యపుస్తకాలు కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది అని, ప్రభుత్వ బడులలోనే అన్ని వసతులు విద్యార్థులకు కల్పిస్తున్నారు కాబట్టి మీ పిల్లలను ప్రభుత్వ బడులలోనే చేర్పించండి చదివించండి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటను వేసేందుకు ప్రభుత్వ బడులు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు దోహదపడతారని, మీ పిల్లలను ప్రభుత్వ బడులలోనే చేర్పించి చదివించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతయ్య, బి యాదయ్య, సత్యనారాయణ ,రహమత్ అలీ ,సుజాత ,సరోజ, సుజాల పావని ,వెంకన్న, దనమ్మ, నవనీత, లివిన, అంగన్వాడి ఉపాధ్యాయులు, తల్లుల కమిటీ సభ్యులుతదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


