Pre-Primary School : చదవాలని ఆశ ఉన్నా భవన నిర్మానం లేక అవస్థ పడుతున్న గిరిజనీకం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) అల్లూరిజిల్లా, బూదరాళ్ల పంచాయితీ పరిధిలో చీడిపల్లి గ్రామంలో సుమారు 100 కుటుంబాలు కలవు. గ్రామంలో ప్రి ప్రైమరీ స్కూల్* ఉంది. అయితే గత ప్రభుత్వం గ్రామానికి “నాడు నేడు” పథకం కింద బిల్డింగ్ మంజూరు చేసింది. ఆ భవన నిర్మాణం పూర్తి కాకుండానే మధ్యలోనే ఆగిపోయిందని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో అంగన్వాడీ పిల్లలు ఇరవై ఆరు మంది, బాలింతలు నలుగురు, కిషోర బాలికలు పన్నెండు మంది ఉన్నారు. పంచాయితీ పరిధిలో బూదరాళ్ల గ్రామంలో మినహాయించి, మిగతా ఏ గ్రామాల్లో కూడా అంగన్వాడీ శాశ్వత భవనాలు లేవు. పంచాయితీ పరిధిలో గత ప్రభుత్వం అన్నవరం,గరిమండ,బాలరేవుల,చీడిపల్లి గ్రామాల్లో నాడు నేడు పథకం కింద పక్క భవనాలు మంజూరు చేసింది.

బాలరేవుల గ్రామంలో ఎటువంటి బిల్డింగ్ లేనందున గత సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ నెం.69 ని, మధ్యలో నిలిపివేయబడిన అంగన్వాడీ ప్రి ప్రైమరీ స్కూల్ ని అధికారులు హుటాహుటిన రేకులు పై కప్పు వేసి పోలింగ్ నిర్వహించారు. మిగతా చీడిపల్లి,అన్నవరం,గరిమండ గ్రామాల్లో మంజూరు కాబడిన భవనాల్ని గాలికొదిలేశారు. మేజర్ పంచాయితీ పరిధిలో కునుకూరు, బి కొత్తవీధి, సాకులపాలెం,చౌడుపల్లి, నూకరాయితోట, ముకుడుపల్లి, కిండంగి, గొర్రెలమెట్ట, కొర్రపాడు, పిట్టలపాడు, పిడుడుగురాయి, వంతమర్రి, లోయలపాలెం, గోధుమలంక, పోకలపాలెం, కన్నవరం, బొడ్డుమామిడి, రాజులపాడు, దొడవగొయ్యి తదితర గ్రామాల్లో ఉన్న ప్రి ప్రైమరీ అంగన్వాడీ స్కూల్స్ కి, భవనాలు లేక ఆయా గ్రామాల్లో ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.

కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటానే పంచాయితీ పరిధిలో ఉన్న చీడిపల్లి గ్రామంతో పాటు మిగతా 22 గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ/ప్రి ప్రైమరీ స్కూల్స్ కి శాశ్వత పక్క భవనాలు మంజూరు చేసి, పిల్లలు యొక్క భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని, సంబధిత శాఖ అధికారుల్ని స్థానిక సర్పంచ్ సాగిన ముత్యాలమ్మ, వార్డ్ సభ్యలు సంజీవ్ లు డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The tribals are facing

You cannot copy content of this page

Scroll to Top