త్రినేత్రం న్యూస్, ( పాడేరు ) నియోజకవర్గ ఇంచార్జ్: ఆదివాసీలకు 100% రిజర్వేషన్ ఇచ్చిన తరువాతేనే ఏజెన్సీ ప్రాంత టీచర్స్ పోస్ట్ లు భర్తీ చేయాలి.
మెగా DSC నుండి ఏజెన్సీ ప్రాంత టీచర్స్ పోస్టులు మినహాయించాలి.
ఆదివాసీ స్పెషల్ DSC నోటిఫికేషన్ ను వెంటనే ప్రకటించాలి.
సి.ఎం నారా చంద్రబాబు నాయుడు హామీని అమలు చేయాలి.
కాలయాపన వల్ల ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగింది.
ఐదో షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ నూరు శాతం రిజర్వేషన్ అమలు కు చట్టం చేయాలి.
పాడేరు ఐ టి డి. ఏ వద్ద ఆదివాసీ DSC సాధన కమిటీ మరియు ఆదివాసీ నిరుద్యోగుల సంఘం అధ్యర్యంలో అభ్యర్థులు, నిరుద్యోగులు 48 గంటల ధర్నా ను ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి. అప్పల నరస ప్రారంభించారు. పి. అప్పల నరస మాట్లాడుతూ ఆదివాసీ DSC సాధన కమిటీ ఉద్యమం తో ఏజెన్సీలో స్థానిక ఆదివాసులకే ఉపాధ్యాయ, ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ ఆచరణ లో జాప్యం కావడం వల్ల వేలాది మంది ఆదివాసి నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు. మెగా డిఎస్సీలో ప్రకటించిన ఏజెన్సి ప్రాంత ఉపాద్యాయ పోస్టులను స్థానిక ఎస్టి అభ్యర్థులతో భర్తీ చేయాలనీ, ఉద్యోగ నియామకాల చట్టం చేయాలన్న ఆదివాసుల డిమాండ్ నెరవేర్చిన తరువాతనే టీచర్స్ పోస్టులు భర్తీ చేయాలనీ కోరారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ని అనుసరించి ఐదో షెడ్యూల్ పెరా 5(2)ల రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఆదివాసుల జీవనోపాధిని రక్షించడం, వారిని వృద్దిలోకి తీసుకురావడం (ఉద్ధరించడం) ప్రభుత్వాల అత్యవసరమైన, చట్టపరమైన బాధ్యత అని, రాజ్యాంగం లో ఏ నిబంధనలు ఉన్న 5 వ షెడ్యూల్డ్ ముందు సరికదాని 5 వ షెడ్యూల్డ్ చట్టం లో ఉన్న విషయం ను గౌరవ సుప్రీం కోర్ట్ సమతా తీర్పు లో పేరుకున్నాందని అన్నారు.
గత నాలుగున్నర ఏళ్లుగా ఆదివాసీ స్పెషల్ DSC సాధన కమిటీ పోరాడుతుందని, రాష్ట్ర గిరిజన మంత్రి, సి. ఎం. ఓ ఆపీస్ తో నిర్వహించిన చర్చలు అనంతరం నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పిస్తామని సి. ఎం గారు ప్రకటించారాని, కానీ మెగా DSC లో అమలుకు ఉత్తర్వులు జారీ చేయకపోవడం వల్ల వేలాది మంది టీచర్స్ ఉద్యోగాలు కోల్పోయి, నిరుద్యోగులగా మిగిలిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈశ్వన్య రాష్ట్రాలలో స్థానిక ఎస్టిలకు 80 శాతం రిజర్వేషన్లు అమలులో ఉండగా, కేంద్ర పాలిట ప్రాంతం లో లక్షద్వీప్ లో స్థానిక ఎస్టిలకు నూరు శాతం రిజర్వేషన్ ను అక్కడ ప్రభుత్వం అమలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కోర్ట్ పేరు చెప్పడం సరికదాని అన్నారు. అలాగే, ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇటివలే లడఖ్ లో 85 శాతం స్థానికులకు, 10 శాతం ఆర్థిక బలహీన వర్గాలకు (EWS), 5 శాతం ఇతరులకు ఇచ్చారన్నారు. సుప్రీంకోర్టు తీర్పులో ఎమున్నప్పటికి, ఐదో షెడ్యూల్ ప్రాంతంలో 1/70 భూ బదలాయింపు నిషేద చట్టం, పెసా, అటవీ హక్కుల గుర్తింపు చట్టం వంటి కఠీనమైన రాజ్యంగ చట్టాలు అమలులో ఉన్నాయని, వాటిని ఉల్లంగించడానికి వీలులేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి నిరుద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ సాగిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


