ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ మే09 త్రినేత్రం న్యూస్. ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు శాలువాతో సత్కరించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్. దేవరకొండ పట్టణ పరిధిలోని ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాల విద్యార్థులు ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్
ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు,ప్రైవేటు సంస్థల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల సిబ్బందిని, అధ్యాపకులను, తల్లిదండ్రులకు విద్యార్థులను ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బుజ్జి లచ్చిరామ్ నాయక్, సీనియర్ నాయకులు పాప నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, మాజీ ఎంపీటీసీ సీత్యా నాయక్,నాయకులు నాగేశ్వర్ రావు,కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


