Apply for Licensed Surveyors : లైసెన్సుడ్ సర్వేయర్ల దరఖాస్తు చేసుకోండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : మే 17 లోపు దరఖాస్తులు లైసెన్సుడ్ సర్వేర్ల శిక్షణకు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి సర్వేయర్ల శిక్షణ కోసo అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్
భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి భూ హక్కుల రికార్డు చట్టం-2025 ను ఏప్రిల్ 14న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇంటర్ లో గణితం 60 శాతం మార్కులు నుంచి బీటెక్ సివిల్ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు మే 17 వరకు మీ- సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
రెవెన్యూ పరిపాలనకు, సర్వే మరియు ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహాయంగా, రాష్ట్రంలోని దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తోందని, లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ తాలిమ్ దరఖాస్తులను ఆహ్వానించిందని, రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు, ప్రాస్పెక్టస్ పొందవచ్చని, మీసేవా కేంద్రాల్లోనే ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. ఇంటర్ లో గణితంతో 60 శాతం మార్కులు సాధించిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ డిప్లొమా సివిల్, బీటెక్ సివిల్ లేదా సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో మే 26 నుండి జులై 26 వరకు 50 రోజుల పని దినాల్లో శిక్షణ ఇవ్వబడుతుందని ఇందుకు ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్య ర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Apply for Licensed Surveyors

You cannot copy content of this page

Scroll to Top