పదవ తరగతిలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సన్మానం చేసి మెమెంటో అందజేసిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్
దేవరకొండ మే 2 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ కేంద్రంలోని బచ్ పన్ & ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని,విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పాల్గొని, ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సన్మానం చేసి, మెమెంటోలు అందజేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేశంలో సమూలమైన మార్పు రావాలంటే ప్రతి వారికీ నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రైవేటు సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల సిబ్బందిని, అధ్యాపకులను, విద్యార్థులను ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా అభినందించారు.
ప్రైవేటు & ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించడం ప్రజా ప్రభుత్వం పనితీరుకు గీటురాయి అని అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,PACs చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్,పట్టణ మాజీ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు లోకాసాని కృష్ణయ్య,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, సీనియర్ నాయకులు పాప నాయక్, సురేందర్ రెడ్డి,పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


