Chairperson Rani : తుఫాన్ సహాయ చర్యల్లో అధికారులు పాత్ర ప్రశంసనీయం

TRINETHRAM NEWS

చైర్ పర్సన్ రాణి…

త్రినేత్రం న్యూస్, అక్టోబర్ 29, మండపేట: ముంతా తుఫాన్ సహాయ చర్యలు తీసుకోవడం లో అధికారులు కీలక పాత్ర పోషించారనీ వారి సేవలు ప్రశంసనీయమని చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, పేర్కొన్నారు.మండపేట పుర పాలక సంఘం కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశాలు,ఆమె అధ్యక్షతన బుదవారం జరిగాయి. ఎక్స్ అఫిషియో సభ్యులు గా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, హాజరయ్యారు.

ఈ సందర్భంగా సమావేశం ఆరంభం కాగానే చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి మాట్లాడుతూ మండపేట కమీషనర్ టివి రంగారావు అర్ధరాత్రి కూడా కార్యాలయం ఉండి ఉద్యోగులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది కి సూచనలు ఇచ్చారని కొనియాడారు. అందరూ కార్యాలయం వద్ద ఉండి అప్రమత్తంగా వ్యవహరించారని చెప్పారు. అలాగే విద్యుత్ శాఖ కార్మికులు, సిబ్బంది, అధికారులు సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. మీడియా ప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చారని ప్రతినిధులను అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

cyclone relief operations is commendable

You cannot copy content of this page

Scroll to Top