ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….
చైర్ పర్సన్ రాణి….
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 27, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలనీ జిల్లా, మండపేట, తుఫాన్ ప్రభావం తో మండపేట మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పురపాలక సంఘం కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. అన్ని వార్డుల్లో అత్యవసర సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ముఖ్యంగా విద్యుత్, డ్రైన్ లు పారిశుధ్యం, మంచినీటి సరఫరా నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


